Header Banner

తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ స్లీపర్ రైళ్ల కేటాయింపు! రూట్స్ ఫిక్స్..!

  Fri May 02, 2025 14:50        Politics

తెలుగు రాష్ట్రాల రైల్వే వ్యవస్థలో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది సరి కొత్త టెక్నాలజీతో రూపు దిద్దుకుంటున్న వందేభారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కేందుకు సిద్ధమయ్యాయి. తొలి విడతలో నే ఈ రైళ్లను తెలుగు రాష్ట్రాలకు కేటాయించేందుకు సూత్రప్రాయంగా ఆమోదం లభించింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న వందేభారత్ రైళ్లకు ఆదరణ పెరుగుతోంది. దీంతో, దూరపు ప్రయాణాల కోసం వందేభారత్ స్లీపర్ ను కేటాయించాలని రెండు రాష్ట్రాల ఎంపీలు రైల్వే శాఖ పైన ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో, రెండు వందేభారత్ స్లీపర్ ఖాయమైనట్లు సమాచారం. పెరుగుతున్న డిమాండ్ దేశ వ్యాప్తంగా వందేభారత్ రైళ్లు ప్రస్తుతం 136 మార్గాల్లో నడుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అయిదు రైళ్లు కొనసాగుతున్నాయి. అయితే, వందేభారత్ స్లీపర్ కోసం తెలుగు రాష్ట్రాల నుంచి డిమాండ్ పెరుగుతోంది. వందేభారత్ స్లీపర్ రైళ్లు తొలి విడతగా 9 సర్వీసులు ప్రారంభించేలా నిర్ణయం చేసారు. అందులో తెలుగు రాష్ట్రాలకు రెండు కేటాయించేలా నిర్ణయించినట్లు సమాచారం.


వీటికి సంబంధించి రూట్ పైనా స్పష్టత వచ్చింది. ఈ రైళ్లలో ఏపీ ఫస్ట్‌ క్లాస్‌, సెకండ్‌ క్లాస్‌ ఏసీ, ఏసీ త్రీ టైర్‌ అందుబాటులో ఉంటాయి. మొత్తం 1,128 బెర్తులు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటాయి. మొత్తం 24 వందేభారత్ స్లీపర్ రైళ్ల కోసం ప్రస్తుతం ఆర్డర్లు ఉన్నాయి. విజయవాడ టు అయోధ్య ఇక, తెలుగు రాష్ట్రాల నుంచి తొలి వందేభారత్ స్లీపర్ రైలు విజయవాడ నుంచి అయోధ్య / వారణాసి వరకు కేటాయించాలని సూత్ర ప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ నుంచి వరంగల్ మీదుగా ప్రస్తుతం రెగ్యులర్ రైళ్లు ప్రయాణించే మార్గంలోనే వందే భారత్ స్లీపర్ ను అయోధ్య కు కేటాయించేలా నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది. రాత్రి సమయం లోనే ఈ రైలు ఉండేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అదే విధంగా సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ కి వందేభారత్ స్లీపర్ రైలు ప్రతిపాదన పైన తుది కసరత్తు జరుగుతోంది.

రైల్వే మంత్రికి నేరుగా ఈ రైలు కేటాయింపు కోసం వినతులు వస్తున్నాయి. అదే విధంగా విశాఖ నుంచి తిరుపతి, సికింద్రాబాద్ నుంచి తిరుపతి, సికింద్రాబాద్ నుంచి బెంగళూరుకు వందేభారత్ స్లీపర్ రైళ్ల కేటాయింపు కోసం రైల్వే శాఖకు ప్రతిపాదనలు అందాయి. రెండు రైళ్లకు ఛాన్స్ కాగా, విజయవాడ నుంచి అయోధ్య, అదే విధంగా సికింద్రాబాద్ నుంచి తిరుపతికి రెండు వందే భారత్ స్లీపర్ రైళ్లను తొలి విడతలో కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మార్గా ల్లో రద్దీ.. ఆక్యుపెన్సీ...డిమాండ్ పరిగణలోకి తీసుకుంటున్నారు. ప్రస్తుతం తొలి విడత వందేభారత్ స్లీపర్ పట్టాలెక్కించేలా ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే, తొలి విడతలో ఏ మేరకు సాధ్యం అనే అంశం పైన అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. రైల్వే అధికారులు ఈ రెండు ప్రతిపాద నల్లో ప్రయాణీకుల డిమాండ్.. రద్దీ గురించి నివేదికలు ఇవ్వనున్నారు. రైల్వే మంత్రిత్వ శాఖ తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే, తొలి విడతలోనే వందేభారత్ స్లీపర్ తెలుగు రాష్ట్రాలకు కేటా యింపు ఖాయంగా కనిపిస్తోంది.


ఇది కూడా చదవండి: ప్రధాని వస్తుంటే జగన్‌ జంప్‌! ప్రజల మధ్యకు రాలేక పారిపోయాడు! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారత్‌లో 20 వేల ఉద్యోగాలు.. వారికి మాత్రమే ఛాన్స్.. 

 

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

 

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

 

కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!

 

6 లైన్లుగా రహదారిడీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #VandeBharat #SleeperTrains #TeluguStates #IndianRailways #VijayawadaToAyodhya #SecunderabadToTirupati